తెలంగాణలో కరెంట్ కోతలు నివారించేందుకు ,విద్యుత్తు సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని యాదాద్రి పవర్ ప్లాంట్ లో విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసేందుకు అయిదుగురు ఐఏఎస్ లను ప్రత్యేకాధికారులుగా పంపిస్తోంది . 15, 16, 17వ తేదీల్లో చెవ్వూరు హరికిరణ్, 18, 19వ తేదీల్లో వెంకటేశ్ ధోత్రే, 22, 23, 24వ తేదీల్లో రాహుల్ రాజ్, 25, 26, 27వ తేదీల్లో హనుమంతు కొండిబా జెండగే, 28, 29, 30వ తేదీల్లో శివ కుమార్ నాయుడును నియమించింది.