ప్రముఖ OTT స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ నెట్ఫ్లిక్స్ సంస్థ మరోసారి ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా తన ఉద్యోగుల్లో సుమారు 6 శాతం మందిని, అంటే దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. గత కొంతకాలంగా కంపెనీ వృద్ధి రేటు మందగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నెట్ఫ్లిక్స్ తీసుకున్న ఈ లేఆఫ్స్ ప్రొడక్ట్, టెక్నాలజీ, HR, లీగల్ డివిజన్లలో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి బుధవారమే నోటీసులు అందినట్లు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ నివేదించింది.