సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సింగరేణి సంస్థపై బిఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తూ, సంస్థకు చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. సింగరేణి సంస్థను కాపాడింది గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలియజేశారు. సంస్థకు బకాయిలు పెట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. మాజీ సిఎం కెసిఆర్ కుటుంబం సింగరేణి సంస్థను జేబు సంస్థగా మార్చుకుందని విమర్శించారు. బిఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని శ్రీధర్ బాబు అన్నారు.