UPI ఛార్జీల విషయంపై ఆందోళన చెందుతున్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరట అందించింది. దసరా, దీపావళి పండుగ సీజన్ ముగిసే వరకు యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలును వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గతంలో ప్రకటించిన విధంగా అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ కొత్త యూపీఐ ఛార్జీల విధానం.. ఇప్పుడు దీపావళి ముగిసిన వెంటనే ప్రకటించబడే కొత్త తేదీ నుంచి అమలవుతుంది.

