కావోర్ బార్ అండ్ రెస్టారెంట్’కు చేరుకుని కస్టమర్ల ఐడెంటిటీ కార్డులు పరిశీలిస్తుండగా పోలీసుల విధుల నిర్వహణను అడ్డుకోవడమే కాకుండా, వారిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన ఘటనలో ఏపీకి చెందిన 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, కుప్పం ప్రాంతాభివృద్ధి సంస్థ (KADA) ప్రత్యేక అధికారి వికాస్ మర్మత్ను ప్రధాన నిందితుడిగా చేర్చుతూ బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.