కాక్రోచ్ ల నిరసనను అఢ్డుకునేందుకు ఢిల్లీలో రైళ్లను రద్దు చేస్తూ, స్టేషన్లను మూసేస్తూ అధికారులు తీసుకుంటున్న చర్యలపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ మండిపడ్డారు. “వీరు భారతదేశ యువత-వారిని ఏదీ ఆపలేదు. ఇలాంటి అపోహలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని నేను అడుగుతున్నాను: నిజంగా ఎవరైనా ఎన్ని రైళ్లను ఆపగలరు? ఎంత అనుసంధానాన్ని అడ్డుకోగలరు? ఎన్ని రోడ్లను దిగ్బంధించగలరు? వీరు భారతదేశ యువత; గత తరాలు చేసినట్లే, ప్రపంచానికి మార్గం చూపించే సామర్థ్యం వీరికి ఉంది-అందువల్ల, వారిని ఏదీ నిలువరించలేదు.” అంటూ చిరాగ్ పాశ్వాన్ తేల్చిచెప్పేశారు.