సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలు.. ఇవాళ బెంగళూరు ఫ్రీడమ్ పార్క్ లో మహాధర్నా (CJP Protest ) చేపట్టారు. అక్టోబర్ 10న ఢిల్లీ వేదికగా జరిగే భారీ ధర్నాకు సన్నాహకంగా బెంగళూరులో వారు సమావేశమయ్యారు. ఈ ధర్నాకు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ , ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ నేత అభిజీత్ దీప్కే సహా పలువురు హాజరయ్యారు.