మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్, సింగపూర్ దేశ మంత్రి షణ్ముగం ఇద్దరూ కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.అత్యంత పవిత్రమైన ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో దేశ విదేశాలకు చెందిన ఇద్దరు మంత్రులు కలిసి రావడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.స్వామివారి సన్నిధిలో అడుగుపెట్టిన వీరికి ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.ఎంతో భక్తిశ్రద్ధలతో వీరు శ్రీవారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.