‘ఫార్ములా-ఈ రేస్’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్టు ఇంపౌండ్ (తాత్కాలిక జప్తు)చేయాలంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇటీవల న్యాయస్థానాన్ని కోరారు.ఈ మేరకు ఏసీబీ న్యాయస్థానం హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయాన్నిఆదేశిస్తూ లేఖ రాసింది.కేటీఆర్‌తో పాటు మిగతా వారి పాస్‌పోర్టు తాత్కాలిక జప్తు చేస్తే ఫార్ములా-ఈ కేసు మరో మారు చర్చనీయాంశంగా మారనుంది.