మయన్మార్లో సైన్యం మరోసారి వైమానిక దాడులు చేసినట్లు తెలుస్తోంది.రఖైన్ రాష్ట్రంలో మార్కెట్ సమీపంలో సైన్యం జరిపినట్లు చెబుతున్న వైమానిక దాడిలో కనీసం 49 మంది మృతి చెందారు.మరో 58 మంది గాయపడ్డారు. వీరిలో 22 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక సహాయక బృందాలు వెల్లడించాయి.మార్కెట్ ప్రాంతం కావడంతో మృతుల్లో వ్యాపారులు, కొనుగోలుదారులు, రహదారిపై వెళ్తున్నవారు ఉన్నట్లు అరాకాన్ ఆర్మీ తెలిపింది.