loader

మేడారం వనదేవతలను దర్శించుకున్న ‘ది ప్యారడైజ్’ చిత్ర బృందం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలను ‘ది ప్యారడైజ్ ’చిత్ర బృందం దర్శించుకుంది. మంగళవారం కథా నాయకుడు నాని, నటుడు సంపూర్ణేశ్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత చెరుకూరి శ్రీకాంత్ సమ్మక్క సారలమ్మలకు పూజలు చేశారు. హీరో నాని 64 కిలోల నిలువెత్తు బంగారం సమర్పించారు. పూజారులు చిత్ర బృందానికి ప్రసాదం అందజేశారు. బిఆర్ఎస్ నాయకులు హీరో నానికి ఘన స్వాగతం పలికారు. నానిని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు ప్రత్యేక […]

కుప్పకూలిన రష్యా బాంబర్ విమానం.. ఆరుగురి మృతి!

రష్యాకు చెందిన అత్యంత శక్తిమంతమైన టీయూ-95 (Tu-95) బాంబర్ విమానం తూర్పు ప్రాంతమైన అముర్ రీజియన్‌లో కుప్పకూలింది. ఇవాళ విమాన శిక్షణ నిర్వహించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బంది మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వండి: సీఎం రేవంత్

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కోరారు. ఈ మేరకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలో సీఆర్ పాటిల్ ను కలిసి రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల వద్దనే నిర్మించుకునేలా మహారాష్ట్రను ఒప్పించి పర్యావరణ అనుమతులు ఇవ్వాలన్నారు. పాలమూరు రంగారెడ్డి, డిండి, సీతారామ ప్రాజెక్టులు, గౌరవెల్లి రిజర్వాయర్ కు అనుమతులు జారీ అయ్యేలా మంత్రిత్వ […]

మొబైల్ ఫోన్ల ధరలు 16% పెరిగాయ్.. ₹10వేల్లోపు వాటిపైనే అధిక భారం

మొమొరీ ధరల కారణంగా దేశీయంగా మొబైల్ ఫోన్ ధరల సగటున 16 శాతం మేర పెరిగాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. మెమొరీ చిప్ ల ధరల పెరుగుదల కారణంగా రూ.10వేల్లోపు బడ్జెట్ ఫోన్లపై అధిక ప్రభావం పడిందని నివేదిక తెలిపింది. సగటున 32 శాతం వీటి ధరలు పెరిగాయని పేర్కొంది. దీంతో 2026 తొలి అర్ధభాగంలో రూ.10వేల్లోపు సెగ్మెంట్లోని స్మార్ట్ ఫోన్ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 65 శాతం మేర క్షీణించినట్లు నివేదిక వెల్లడించింది.

పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్‌కు ఇండియా గుడ్‌బై .. చైనా నుంచి కొత్త మార్గంలో

సుదూర ప్రాంతాలకు ఇండియా నుంచి విమానాలు పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ నుంచి వెళ్తాయి. అంటే, పాక్ గ‌గ‌న త‌లాన్ని వాడుకుంటూ కొన్ని గ‌మ్యాల‌కు ఇండియ‌న్ విమానాలు రాక‌పోక‌లు సాగిస్తుంటాయి. అయితే, ఇటీవ‌లి కాలంలో ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న విబేధాల నేప‌థ్యంలో పాకిస్తాన్ త‌ర‌చూ త‌మ ఎయిర్‌స్పేస్‌ను మూసేస్తోంది. దీంతో ప్ర‌త్యామ్నాయ విమాన‌యాన మార్గాల‌ను అన్వేషిస్తోంది. చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలోని ఎయిర్‌స్పేస్ మార్గాన్ని ఇండియా ప‌రిశీలిస్తోంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాల‌ను ఇండియా అధ్య‌య‌నం చేస్తోంది. ఈ అంశంపై చైనాతో […]

సీఈసీ రాజీనామా, ఎస్‌ఐఆర్‌ నిలిపివేతకు కాంగ్రెస్ పిలుపు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ , సెప్టెంబర్ 29న జరిగిన సమావేశంలో ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై పలు డిమాండ్లు చేసింది.ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, SIR ప్రక్రియను నిలిపివేయాలని కాంగ్రెస్ కోరింది.దేశవ్యాప్తంగా 13.30 కోట్ల మంది ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితాల నుంచి తొలగించబడ్డాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆ పేర్లను పునరుద్ధరించాలని,ఓటర్ల జాబితా మార్పులపై పూర్తి పారదర్శకత పాటించాలని పార్టీ డిమాండ్ చేసింది.

ముస్లింల డేటా కోసమే ఆ కమిషన్? అమిత్ షా పై ఓవైసీ ఫైర్..!

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని జనాభా గణన కమిషన్.. జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజల వాహనాలు,ఆస్తుల కొనుగోళ్లు, పాఠశాలల్లో చేరికలు, ఆధార్, ఓటర్లు మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని హిందూ,ముస్లిం, క్రైస్తవ వర్గాలుగా వర్గీకరించి తెలుసుకోవాలని కోరుతోందని వార్తలొస్తున్నాయి. రాజ్యాంగంలోని లౌకిక స్వరూపం మతపరమైన వర్గాల కింద సమాచారాన్ని సేకరించడాన్ని నిరోధిస్తున్నందున రాష్ట్రాలు ఈ విషయంలో గందరగోళానికి గురవుతున్నాయి. ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యవహారంపై స్పందించారు.

అస్సాం రైఫిల్స్ బృందంపై ఉగ్రవాదుల దాడిలో ఒక సైనికుడు మృతి

అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్ జిల్లాలో భారత్-మయన్మార్ సరిహద్దు వెంబడి మంగళవారం (సెప్టెంబర్ 29) ఒక గస్తీ బృందంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో అస్సాం రైఫిల్స్ జవాన్ ఒకరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారని అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.సరిహద్దు కంచె పనులు జరుగుతున్న ప్రాంతంలో 21 అస్సాం రైఫిల్స్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా,నాంపాంగ్ సర్కిల్ పరిధిలోని నాంపాంగ్ నల్లా సమీపంలో ఈ ఘటన జరిగింది.

ఎలక్ట్రానిక్స్ రంగంలో దూసుకుపోతున్న టాటా గ్రూప్

భారతీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ టెక్నాలజీ అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత చాటుకునేందుకు భారీ ప్రణాళికలతో ముందుకు వెళుతోంది.దేశంలో యాపిల్ ఐఫోన్‌ల తయారీ నుంచి అత్యంత కీలకమైన సెమీకండక్టర్ చిప్స్‌ ఉత్పత్తి వరకు అన్ని విభాగాల్లోనూ టాటా ఎలక్ట్రానిక్స్ దూసుకుపోతోంది. ఈ వ్యాపారాన్ని వేగంగా విస్తరించాలనే ఉద్దేశంతో కంపెనీ తన పెట్టుబడులను భారీగా పెంచేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన పెట్టుబడులను ఏకంగా మూడు రెట్లు పెంచినట్లు స్పష్టమైంది.

తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి..

డీబీఆర్‌ రోడ్డులోని ఓ ప్రైవేట్‌ హోటల్‌ నిర్మాణ పనులు జరుగుతుండగా భారీ క్రేన్‌ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు ఒరిగి లోతులో పడిపోయింది.ఈ ప్రమాదంలో క్రేన్‌ కింద ముగ్గురు కార్మికులు చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.దీంతో ఒక్కసారిగా నిర్మాణ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భారీ క్రేన్‌ ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON