సుదూర ప్రాంతాలకు ఇండియా నుంచి విమానాలు పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ నుంచి వెళ్తాయి. అంటే, పాక్ గగన తలాన్ని వాడుకుంటూ కొన్ని గమ్యాలకు ఇండియన్ విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే, ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న విబేధాల నేపథ్యంలో పాకిస్తాన్ తరచూ తమ ఎయిర్‌స్పేస్‌ను మూసేస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ విమానయాన మార్గాలను అన్వేషిస్తోంది. చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలోని ఎయిర్‌స్పేస్ మార్గాన్ని ఇండియా పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఇండియా అధ్యయనం చేస్తోంది. ఈ అంశంపై చైనాతో ఇండియా కొంతకాలంగా చర్చలు జరుపుతోంది.