తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కోరారు. ఈ మేరకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలో సీఆర్ పాటిల్ ను కలిసి రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల వద్దనే నిర్మించుకునేలా మహారాష్ట్రను ఒప్పించి పర్యావరణ అనుమతులు ఇవ్వాలన్నారు.
పాలమూరు రంగారెడ్డి, డిండి, సీతారామ ప్రాజెక్టులు, గౌరవెల్లి రిజర్వాయర్ కు అనుమతులు జారీ అయ్యేలా మంత్రిత్వ శాఖ నుంచి చొరవ తీసుకోవాలని విన్నవించారు.

