ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ జిల్లా మాల్వాన్ టౌన్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.సోమవారం సురేష్ గుప్తా ఇంటిలో వంట చేస్తుండగా అనుకోకుండా గ్యాస్ సిలిండర్ పేలింది. , ఆ పేలుడు ధాటికి రెండు అంతస్తుల భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలి నేలమట్టమైంది.ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారిలో మూడేళ్ల చిన్నారి బాలుడు ఉండటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ పేలుడు ఎంత శక్తివంతంగా జరిగిందంటే, దీని ప్రభావం సుమారు 200 మీటర్ల దూరం వరకు స్పష్టంగా కనిపించింది.