తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బహుదా, నాగావళి, వంశధార నదులు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. నందిగాం మండలం కొత్తఅగ్రహారం వద్ద వంశధార ఎడమ ప్రధాన కాలువ వంతెన కూలిపోవడంతో పదుల సంఖ్యలో గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సోంపేట, పలాస, కవిటి సహా పలు మండలాల్లో సుమారు 12,022 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 115 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.