భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం పంచాయతీ పరిధిలోని గుర్వాయిగుడెం గ్రామంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా వీచిన బలమైన గాలులు, టోర్నడో ప్రభావంతో గ్రామ పరిసరాల్లోని పంట తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మామిడి, జీడి, పత్తి, పామాయిల్ తోటల్లో భారీగా నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. బలమైన గాలుల
ధాటికి పలు చెట్లు నేలకొరిగాయి. మామిడి, జీడి తోటల్లో కొమ్మలు విరిగిపడడంతో పాటు పామాయిల్ చెట్లు కూడా దెబ్బతిన్నాయి. పత్తి పంట సైతం గాలుల ప్రభావానికి నష్టపోయినట్లు రైతులు పేర్కొన్నారు.