loader

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు బెయిల్

సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం (లిక్కర్ స్కామ్) దర్యాప్తులో భాగంగా నిందితులుగా ఉన్న రాజ్ కెసిరెడ్డి మరియు వాసుదేవరెడ్డిలకు న్యాయస్థానం ఊరట కల్పించింది. ఈ కేసులో కొంతకాలంగా జ్యుడీషియల్ రిమాండ్‌ను అనుభవిస్తున్న వీరిద్దరికీ ఈడీ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ గురువారం తీర్పు వెలువరించింది.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే నిరంకుశంగా మారుతున్నది : కేటీఆర్‌

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునే మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘం తీరు దాదాపు నియంతృత్వ ధోరణిలోకి వెళ్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పుడు, ఎన్నికల సంఘం పనితీరును సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.తెలంగాణలో అత్యధిక ఓట్ల తొలగింపులు బీఆర్‌ఎస్‌ గెలిచిన స్థానాల్లోనే ఉండటం ఆశ్చర్యం కలిగించలేద’ అని అన్నారు.

ఇదంతా పక్కా ప్లాన్-CEC తప్పుకోవాల్సిందే..! రాహుల్

కేంద్రం పార్లమెంట్ లో నల్ల చట్టాలు చేసిందని, వాటి ద్వారా సీఈసీ అయిన జ్ఞానేష్ కుమార్ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. SIR సహా తాజాగా బయటపడిన అక్రమాలకు కారణమైన జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ గందరగోళానికి జ్ఞానేష్ కుమార్‌ బాధ్యుడని, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు దీనిపై ఆయన్ను తప్పుబట్టారని రాహుల్ తెలిపారు. ఓటు మన దేశానికి పునాది అని, మన ఓటును నాశనం చేశారని ఆరోపించారు. […]

అక్టోబర్ 2న యూపీఐ పేమెంట్స్ బంద్

లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వ్యాపార వర్గాలు నడుంబిగించాయి. దీనికి నిరసనగా వచ్చే అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా No UPI Day నిర్వహించాలని ట్రేడర్లు మరియు వివిధ బిజినెస్ అసోసియేషన్లు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వ్యాపార సంఘాలు మరియు అసోసియేషన్లతో లోతుగా చర్చించిన తర్వాతే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ ప్రెసిడెంట్ రవీంద్ర తెలిపారు

నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

హైదరాబాద్‌లో శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. శుక్రవారం ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభించి, మధ్యాహ్నంలోపే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం పూర్తి చేయనున్నారు.

సీఈసీ రాజీనామా చేయకుంటే ‘జంతర్మంతర్ 2.0’! – సీజేపీ

SIR అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. CEC జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే జంతర్ మంతర్ వద్ద మరోసారి నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించింది. త్వరలో జరగబోయే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనూ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని భావిస్తే విపక్షాలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవద్దు. ప్రజాస్వామ్యానికి సీఈసీ ఓ ముప్పులా తయారయ్యారు. ఓటు హక్కు రద్దు చేసేందుకు ఆయన ఎవరు?” అని సీజేపీ […]

అల్లూరి జిల్లాలో వరద బీభత్సం.. విరిగిపడ్డకొండచరియలు

అల్లూరి జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కు వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొయ్యూరు మండలంలో జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. పాడేరు – జి.మాడుగుల మధ్య డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జీకే వీధి మండలంలో ఇటీవల నిర్మించిన జర్రెల కొత్తూరు కల్వర్టు కొట్టుకుపోయింది. చింతపల్లి మండలం చౌడుపల్లి పశువులబందా చెరువుకు గండి పడింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది

భారీ నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

బలహీనమైన ప్రపంచ సంకేతాలు, యూఎస్ బాండ్ల రాబడులలో భారీ పెరుగుదల కారణంగా, భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలైన నిఫ్టీ50, బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ట్రేడింగ్‌లో కుప్పకూలాయి. యూఎస్ బాండ్ రాబడులు 19 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరడం పెట్టుబడిదారులలో తీవ్ర ఆందోళనను రేకెత్తించాయి. మధ్యాహ్నం సమయానికి నిఫ్టీ50 దాదాపు 370 పాయింట్లు (1.58%) క్షీణించి 23,076.55 వద్ద, సెన్సెక్స్ 1,155 పాయింట్లు (1.54%) పడిపోయి 73,673.50 వద్ద ట్రేడయ్యాయి

ఐఐటీ బాంబే విద్యార్థి సూసైడ్ .. తల్లిదండ్రులకు అండగా రాహుల్ గాంధీ

ఐఐటీ బాంబేలో చదువుతూ మరణించిన విద్యార్థి సాహిల్ వాకోడే తల్లిదండ్రులకు అన్ని విధాలా అండగా ఉంటామని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సాహిల్ పేరెంట్స్ రవీంద్ర, సోనాలి వాకోడేలకు రాహుల్ గాంధీ వీడియో కాల్ మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయ. ఈ సందర్భంగా తమ కుమారుడికి న్యాయం కోసం వారు చేస్తున్న పోరాటంలో అండగా ఉంటామని, సాధ్యమైనంత సహాయం చేస్తామని రాహుల్ గాంధీ సాహిల్ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారని పేర్కొన్నాయి.

హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం: ట్రాఫిక్ ఆంక్షలు

ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 10 గంటల వరకు నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన ఊరేగింపు చార్మినార్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ చేరనుంది. ప్రధాన నిమజ్జన మార్గాల్లో ఇతర వాహనాలకు అనుమతి లేదు. నగరంలో ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లేవారు ఇన్నర్ రింగ్ రోడ్, పంజాగుట్ట-బేగంపేట మార్గాలను లేదా ORR ను,పీవీఎన్‌ఆర్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON