కేంద్రం పార్లమెంట్ లో నల్ల చట్టాలు చేసిందని, వాటి ద్వారా సీఈసీ అయిన జ్ఞానేష్ కుమార్ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. SIR సహా తాజాగా బయటపడిన అక్రమాలకు కారణమైన జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ గందరగోళానికి జ్ఞానేష్ కుమార్ బాధ్యుడని, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు దీనిపై ఆయన్ను తప్పుబట్టారని రాహుల్ తెలిపారు. ఓటు మన దేశానికి పునాది అని, మన ఓటును నాశనం చేశారని ఆరోపించారు. ఇది కేవలం ఓటుపై దాడి కాదు, ప్రతి భారతీయుడి భావప్రకటనా స్వేచ్ఛపై దాడి అన్నారు.

