భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వాగులోకి వరదనీరు చేరుతోంది. కొండపల్లి సమీపంలోని కవులూరు వంతెన వద్ద బుడమేరు నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి వచ్చే వరదనీటిని చెరువులకు మళ్లిస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ వెంకటేశ్ తెలిపారు. 5000 క్యూసెక్కుల పట్టిసీమ నీటిని కృష్ణా నదిలోకి పంపిస్తున్నామని చెప్పారు. ఈ వరద నీటితో ఎటువంటి ఇబ్బందిలేదన్నారు. గంటగంటకీ పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.