బిహార్ లో మైనర్లపై వరుస వేధింపుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా సమస్తీపుర్ జిల్లాలో జగత్సింగ్పుర్ గ్రామంలో నడిరోడ్డుపై ఓ బాలికను కొందరు వేధించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఓ టీనేజీ అమ్మాయి, అబ్బాయి కలిసి రోడ్డుపై నడుచుకుంటూ ఫొటోలు తీసుకుంటుండగా కొందరు ఆకతాయిలు వారిని అడ్డగించారు. అమ్మాయిని చుట్టుముట్టి అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వీడియో వైరల్ అవడంతో బిహార పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.