తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) జనరల్ బాడీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తనపై కొందరు దాడికి పాల్పడి చంపుతామని బెదిరించారని ఆరోపిస్తూ అసోసియేషన్ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘు మాస్టర్ తరఫున ఉన్న కొందరు లేడీ డ్యాన్సర్లు తనపై పథకం ప్రకారమే మూకుమ్మడిగా దాడి చేశారని, తనను తీవ్రంగా కొట్టి అసభ్య పదజాలంతో దూషించారని సుమలతా దేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.