అపోలో హాస్పిటల్స్ CSR వైస్ చైర్‌పర్సన్‌గా, హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా నటుడు రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కొణిదెల బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఈ కొత్త బాధ్యతల ద్వారా దేశవ్యాప్తంగా అపోలో గ్రూప్ చేపడుతున్న విస్తరణ కార్యక్రమాలకు నాయకత్వం వహించనున్నారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం సుమారు రూ.8,600 కోట్ల భారీ పెట్టుబడితో తమ
నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా కొత్త ఆసుపత్రుల నిర్మాణం, ప్రస్తుత ఆసుపత్రుల ఆధునికీకరణ వంటి ప్రాజెక్టులను ఉపాసన పర్యవేక్షిస్తారు.