బిహార్ లో అల్లరి మూక బాలికను చుట్టుముట్టి లైంగికంగా వేధించిన ఘటనపై బిహార్ మంత్రి శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. “ప్రపంచం పూర్తిగా నేర రహితంగా ఉండదు. ఇలాంటి చిన్నచిన్న ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. వాటిపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది” అని మంత్రి అన్నారు. అయితే బాలికకు జరిగిన అన్యాయాన్ని.. చిన్న ఘటనగా పేర్కొనడంపై ప్రతిపక్షాలు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. మహిళలకు, బాలికలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని
ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు.