శ్రీకాకుళం జిల్లాకు చెందిన మౌనిక సంతోషి (28), వైజాగ్‌కు చెందిన రమాకాంత్ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి సుమారు ఎనిమిదేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. మౌనిక యాక్సిస్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా.. రమాకాంత్ ఇన్ఫోసిస్‌లో హెచ్ఆర్‌గా పనిచేస్తున్నారు. మౌనిక, రమాకాంత్ దంపతుల మధ్య పిల్లలకు సంబంధించిన విషయాలపై తరచూ గొడవలు జరిగేవని పోచారం డివిజన్ గెలాక్సీ టవర్స్‌లో శనివారం రాత్రి మౌనిక చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మౌనిక మృతికి భర్త వేధింపులే కారణమని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.