రమానందన బాధితులు బాధితులు బేగంపేటలోని జ్యోతిబాఫులే ప్రజాభవన్ లో నిర్వహించే సీఎం ప్రజావాణిలో గద్వాల విజయలక్ష్మి కలిసి ఉద్యోగ వీసా ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.25లక్షల – రూ. 95లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. తెలంగాణలోని వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. కాగా.. వారి గోడు విన్న సీఎం ప్రజావాణి బాధ్యులు రాష్ట్ర డీజీపీతో పాటు ఈడీకి ఫిర్యాదు చేయాలని, తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.