గురజాడ అప్పారావు
గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 – 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. హేతువాది. 19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలో రచనలు ఈనాటికీ ప్రజల మన్ననాలు పొందుతున్నాయి. ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు

