ఆఫ్గనిస్తాన్‌పై పాకిస్తాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఆఫ్గనిస్తాన్‌పై సోమవారం పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఆఫ్గనిస్తాన్‌లోని కునార్, పక్తిక ప్రాంతాలపై ఈ దాడులు జరిగాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దులో కొనసాగుతున్న తీవ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో పాక్ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. సోమవారం వేకువఝామున పాక్ వైమానిక దాడులకు దిగింది.