అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. నౌకాదళ పోరాటానికి అవసరమైన సాధనాలను తాము నిర్మించుకున్నామని ఇరాన్ తెలిపింది. “ఒకవేళ యుద్ధం అంటూ మళ్లీ మొదలైతే, అమెరికా నౌకలు హిందూ మహాసముద్రాన్ని విడిచి వెళ్లేంత వరకు, అవి అక్కడ ఎక్కడ ఉన్నా వాటిని వేటాడి వెంటాడుతామన్నారు. ఈ పోరాటం ఇక ఆగే ప్రసక్తి లేదన్నారు. మేము మా యుద్ధానికి సంబంధించిన శక్తి, సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నామని ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ, హైదరాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం పోస్ట్ చేసిన వ్యాఖ్యలలో తెలిపారు.