ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గురువారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 108, 9 ఫోర్లు, 11 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. అఫ్గానిస్తాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 30 బంతుల్లోనే మూడంకెల స్కోరును అందుకుని అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖించాడు. టీమ్ ఇండియా తరఫున ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.