మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి కిలోమీటర్ దూరంలో సర్వే చేయడానికి రెవెన్యూ అధికారులు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. మా భూములు మేము సాగు చేసుకుంటుంటే మీరు ఇప్పుడు ఎందుకు వచ్చి సర్వే చేస్తున్నారు అని వారిని నిలదీశారు. 325 ఎక్కడకు పోలేదు.. ఇక్కడే ఉంది..భూములు మావి ఎక్కడికి పోలేదు.. మంచిగనే ఉన్నయ్ సార్.. మరి దేనికోసం చేస్తున్నరని మాకు డౌట్ ఉంటది కదా అని రైతు అడిగారు.