ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విశాఖవాసులు మృతి చెందారు.విశాఖకు చెందిన జీటీ ప్రసాద్ తన భార్యతో కలిసి శుభకార్యంలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్బోర్న్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ భార్య, కోడలు మృతి చెందగా.. కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. తన కళ్లెదుటే కారు ప్రమాదంలో భార్య, కోడలు నేహా మృతి చెందటంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జీటీ ప్రసాద్ గతంలో వీడీసీఏలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు.