గతంలో గర్భవతి అని కూడా చూడకుండా తన యూట్యూబర్ భార్య వైష్ణవిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరిబాబును, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నిజామాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఆర్ఆర్ చౌరస్తా నడిబొడ్డున పగటిపూటే పక్కా స్కెచ్‌తో కత్తులతో పొడిచి చంపేశారు. నడిరోడ్డుపై రక్తం ఓడుతూ ప్రాణభయంతో పరుగులు తీసేందుకు ప్రయత్నించిన హరిబాబును వెంటాడి మరీ తీవ్రంగా నరికి పారిపోయారు. తీవ్రగాయాల పాలైన హరిబాబు ఘటనా స్థలంలోనే విగతజీవుడిగా పడిపోయాడు.