రాష్ట్రంలో APPSC ద్వారా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సుదీర్ఘకాలంగా అనుసరిస్తున్న మెరిట్ ప్రాతిపదికన వెయిటేజ్ పద్ధతిని కాకుండా రాత పరీక్ష ద్వారా నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెరిట్ ఆధారంగా నియామక ప్రక్రియ ఉండాలని ఈనెల 13, 14న జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేస్తూ తాజా జీవోను పశుసంవర్ధక శాఖ గురువారం విడుదల చేసింది.