గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ పలువురు నిరుద్యోగులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వం ఇచ్చిన రెండేళ్ల వయో సడలింపు సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రెగ్యులర్ గా నోటిఫికేషన్లు రాకపోవడం వల్లే వయోపరిమితి దాటిపోయి లక్షలాది మంది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకునేలా చొరవ చూపాలని కోరారు.