గురువారం కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల కోసం పంజాబ్ రైతులు రాష్ట్రవ్యాప్తంగా రైల్ రోకో చేపట్టారు. పలు రైల్వే స్టేషన్ల వద్ద నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లు నిలిచిపోగా, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, దానివల్ల రైతులకు కలిగే పరిణామాలపై స్పష్టత ఇవ్వాలని పంజాబ్ రైతులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ సవరణ చట్టంపై ప్రభుత్వ వైఖరి, ప్రతిపాదిత విత్తన చట్టం, సహకార కేంద్రాల రద్దుపై స్పష్టత కోరుతున్నారు.