రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష ఇవాళ తమ సొంత పార్టీ నాయకుల మీదే మండిపడ్డారు. నియోజకవర్గంలో ఏమాత్రం పట్టులేని, ప్రజలతో సంబంధాలు లేని నాయకులు, నా మీద పార్టీ కార్యాలయంలో ఫిర్యాదులు చేస్తారా పార్టీ ఆఫీసుకు వెళ్లి ఒక వర్గానికే చేస్తున్నారు , వైసీపీ వాళ్లకు ఇచ్చేశారని చెప్తారా మీరు..తాట తీసేస్తాను ఎవరికైనా.. పని చేయరు, ఓట్లు వేయించలేరు, తిరిగి కష్టపడరు.. పార్టీ కార్యక్రమాలు చేయరు. మళ్లీ ఎమ్మెల్యే గారి మీద బురదజల్లుతారా మీరు అంటూ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు.