యూపీఐ ఛార్జీల నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సంతృప్తిపరిచేందుకే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. యూపీఐపై విధించనున్న ఛార్జీని ‘యూపీఐ పన్ను’గా అభివర్ణిస్తూ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.యూపీఐపై రుసుము విధించడం ద్వారా భారతీయులపై భారం మోపుతున్నారని, అమెరికాకు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని రాహుల్ ఆరోపించారు.