మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, టాలీవుడ్ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. సుస్మితను విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమించింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు కొణిదెల సుస్మితను దుర్గమ్మ ఆలయ
ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సుస్మిత విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు..అలాగే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక ఉత్సవాల్లో భాగస్వామ్యమై తగిన సూచనలు, సలహాలు అందించనున్నారు.