తెలంగాణ రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ), తెలంగాణ శాసన పరిషత్ (కౌన్సిల్) సెప్టెంబర్ 7వ తేదీ, సోమవారం నుంచి సెషన్ మొదలవ్వనుంది. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలి. సభ్యులకు అందించే మెటీరియల్‌ను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ముందస్తుగా సమర్పిస్తే, సభ్యులు చదువుకుని సమావేశాలకు హాజరవుతారు.శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలి. రక్షణ, బందోబస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను అని స్పీకర్ పేర్కొన్నారు.