సీఎం క్యాంపు కార్యాలయంలో జాయింట్ స్టాఫ్ ఆఫ్ కౌన్సిల్ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి రెండు డీఏలు చెల్లించేందుకు, అలాగే 12వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) నియామకానికి అంగీకారం తెలిపారు. అలాగే సరెండర్ లీవ్స్ మొత్తాన్ని వచ్చే సంక్రాంతి నాటికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ఈ సమావేశంలో సీఎం నిర్ణయించారు. పోలీసులకు అదనంగా ఒక సరెండర్ లీవ్ను ఈ దసరాకే చెల్లించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.