నిమ్స్‌లో ఉచితంగానే EHS ఓపీ సేవలు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈహెచ్‌ఎస్ కొత్త నిబంధనల ప్రకారం నెట్‌వర్క్ హాస్పిటళ్లలో కేవలం ఇన్‌పేషెంట్ సేవలు, వెల్‌నెస్ సెంటర్లలో మాత్రమే ఓపీ సేవలు అందించాల్సి ఉంది. అయితే ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిమ్స్ ఆస్పత్రిలో మాత్రం ఉచిత ఓపీ సేవలను యథావిధిగా కొనసాగించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు.. డ్రైవర్ మృతి, 15 మందికి గాయాలు
మునుబోలు పోర్టు అడ్డరోడ్డు పై వంతెనపై శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి నుంచి విజయవాడ వెళుతున్న వెంకటరమణ ట్రావెల్స్ బస్సు పోర్టు రోడ్డు సమీపానికి వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీని అదుపుతప్పి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్‌లో DSC నియామక ప్రక్రియలో చోటుచేసుకుంటున్న అక్రమాలు, అవకతవకలను ప్రశ్నిస్తున్నారనే నెపంతో కూటమి ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను అణచివేస్తోందని మాజీ మంత్రి ఆర్‌కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాధితుల తరఫున నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పలు ప్రముఖ మీడియా సంస్థల సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు విధించడం శోచనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా సాక్షి డిజిటల్‌కు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాటు బిగ్ టీవీ ఇన్‌స్టా ఖాతాలను భారతదేశంలో అందుబాటులో లేకుండా చేయించడం కూటమి ప్రభుత్వ భయానికి, అసహనానికి […]
తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపునకు గ్రీన్ సిగ్నల్
ఆటో మీటర్ ఛార్జీల సవరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆటో సంఘాల నుంచి వస్తున్న నిరంతర విజ్ఞప్తులను పరిశీలించిన సర్కార్, కొత్త ధరలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.ఆటో ఛార్జీల పునఃసమీక్ష కమిటీ ఒక కీలక నివేదికను రూపొందించింది. ఈ సిఫారసుల ప్రకారం ప్రస్తుతం ఉన్న రూ.20 కనీస ఛార్జీని ఏకంగా రూ.30కి పెంచాలని ప్రతిపాదించారు. అలాగే, అదనపు కిలోమీటరుకు వసూలు చేసే ఛార్జీని రూ.11 నుంచి రూ.14కి సవరించాలని సూచించారు.
కేరళలో ఘోర ప్రమాదం.. 8 మంది విద్యార్థులు మృతి
శుక్రవారం రాత్రి 11:40 గంటల ప్రాంతంలో త్రిస్సూర్ జిల్లా కైపమంగలం సమీపంలోని పనంబిక్కున్ను వద్ద జాతీయ రహదారి 66పై తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కారులో ఎనిమిది మంది యువకులు గురువాయూర్ నుంచి కొడుంగల్లూర్ వైపు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో హైవేపై నిర్మాణ పనులు జరుగుతుండగా రోడ్డు పక్కన ఆపి ఉంచిన గూడ్స్ లారీని వారి కారు అత్యంత వేగంగా వచ్చి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.దుర్ఘటనలో ఎనిమిది మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు.దిండిగల్ ప్రాంతానికి చెందిన పీఎస్‌ఎన్ఏ […]
మదర్ థెరీసా
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 – సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు గా జన్మించిన అల్బేనియాదేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కలకత్తాలో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.
జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం
ఉపాధ్యాయ దినోత్సవం ( Teachers’ Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం. మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటున్నాము.

