ఆంధ్రప్రదేశ్‌లో DSC నియామక ప్రక్రియలో చోటుచేసుకుంటున్న అక్రమాలు, అవకతవకలను ప్రశ్నిస్తున్నారనే నెపంతో కూటమి ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను అణచివేస్తోందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాధితుల తరఫున నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పలు ప్రముఖ మీడియా సంస్థల సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు విధించడం శోచనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా సాక్షి డిజిటల్‌కు చెందిన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాటు బిగ్ టీవీ ఇన్‌స్టా ఖాతాలను భారతదేశంలో అందుబాటులో లేకుండా చేయించడం కూటమి ప్రభుత్వ భయానికి, అసహనానికి స్పష్టమైన నిదర్శనమని తీవ్ర విమర్శలు చేశారు.