ఆటో మీటర్ ఛార్జీల సవరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆటో సంఘాల నుంచి వస్తున్న నిరంతర విజ్ఞప్తులను పరిశీలించిన సర్కార్, కొత్త ధరలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.ఆటో ఛార్జీల పునఃసమీక్ష కమిటీ ఒక కీలక నివేదికను రూపొందించింది. ఈ సిఫారసుల ప్రకారం ప్రస్తుతం ఉన్న రూ.20 కనీస ఛార్జీని ఏకంగా రూ.30కి పెంచాలని ప్రతిపాదించారు. అలాగే, అదనపు కిలోమీటరుకు వసూలు చేసే ఛార్జీని రూ.11 నుంచి రూ.14కి సవరించాలని సూచించారు.