తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు నోటా NOTA వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. అంతేకాదు డిప్యూటీ మేయర్ పదవి ఎంపికపై కాలపరిమితి నిర్దేశించింది. మున్సిపల్ కార్పొరేషన్ తొలి భేటీ జరిగిన 15 రోజుల్లోపే డిప్యూటీ మేయర్ ఎన్నికను పూర్తి చేయాలని.. ఎన్నిక జరగడానికి ఒక రోజు ముందే విప్ పత్రాన్ని సమర్పించాలని పేర్కొంది. విప్‌ను ధిక్కరించిన కౌన్సిలర్ల సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని స్పష్టం చేసింది. ఒక వేళ ఎన్నికలో అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే, లాటరీ విధానం ద్వారా విజేతను ఎంపిక చేయాలని తెలిపింది.