ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మున్సిపల్ సవరణ చట్టం 2026′ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నూతన చట్ట సవరణలు ఆగస్టు 28 నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపిన ప్రభుత్వం.. ఇకపై మేయర్ , వార్డు సభ్యుల ఎన్నికలకు ప్రత్యేక ఓటింగ్ పద్దతిని వర్తింపజేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో EVM లను వినియోగించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఓటర్లకు నోటా వినియోగించుకునే అవకాశం ఇచ్చినట్లు వెల్లడించింది.