రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్‌లను పునర్వ్యవస్థీకరిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 13 జిల్లా పరిషత్‌ల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్‌లుగా రూపుదిద్దుకోనున్నాయి. నూతనంగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం ఏపీ ప్రభుత్వం జడ్పీలను మంజూరు చేసింది. ఈ నూతన జడ్పీల నిర్వహణ, పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ ప్రభుత్వం అదనపు పోస్టులను సమకూర్చింది.