ఉత్తరప్రదేశ్ లోని సహరాన్‌పూర్ కలెక్టరేట్ ప్రాంగణంలోని మసీదు కూల్చివేతపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇక వర్తించదా..? అని ప్రశ్నించారు. శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకు మసీదును కూల్చివేసినట్లు తెలిపారు. మసీదు ఉనికిని నిరూపించే 1911 నాటి రికార్డులు కమిటీ వద్ద ఉన్నాయని ఓవైసీ చెప్పారు. ఏళ్ల తరబడి అక్కడ ప్రార్థనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఆ భూమిపై హక్కు ఎలా కోరుతుందని ఓవైసీ ప్రశ్నించారు.