పశ్చిమగోదావరి జిల్లా తణుకుకి చెందిన నంబూరి శ్రీనివాస్గా అనే వ్యక్తి తన భార్య పద్మిని, కొడుకు,కూతుళ్లు వెంకటేశ్వర్, నిత్యశ్రీతో కలిసి చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో శ్రీనివాస్ భార్య పద్మినిని స్థానిక జాలర్లు రక్షించగా.. ఆయనతో పాటు కుమారుడు వెంకటేశ్వర్, కుమార్తె నిత్యశ్రీ గల్లంతయ్యారు. అయితే గత కొన్ని రోజులు ఫ్యామిలీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. ఆకారణంగానే ఆత్మహత్యకు యత్నించిన ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు