సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ భరద్వాజ్ పై ప్రముఖ సింగర్ చిన్మయి భరద్వాజ్ ఒక నేరస్థుడు, దేశ వ్యతిరేకి, హింసాత్మక వ్యక్తి అంటూ తన ఎక్స్ ఖాతాలో నేడు పోస్టు చేశారు. దీనికి కారణం సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనల్లో ఓ బాలిక పాల్గొనగా భరద్వాజ్ సదరు బాలిక తండ్రిపై దాడి చేశాడు. అతడి తల పగలగొట్టి, మైనర్ బాలికపై లైంగిక వేధింపుల బెదిరింపులకు పాల్పడినందున పోలీసులు భరద్వాజ్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు ఒక్క రోజుకే జైలు నుంచి విడుదలయ్యాడు.