ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో కుప్టి వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జాతీయ రహదారిపై టమాటా లోడ్‌తో వెళ్తున్న లారీ, మరో లారీ ఢీకొని బోల్తాపడటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఈ వంతెనకు ఒకవైపు బుంగ పడటంతో రాకపోకలు వన్ వే లో కొనసాగుతుండగా, అదే మార్గంలో ప్రమాదం జరగడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. జాతీయ రహదారిపై ఇరువైపులా దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు.